రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ లతో పాటు మొత్తం 12మంది కేంద్ర మంత్రులు రాజీనామా
- కాసేపట్లో కేంద్ర కేబినెట్ విస్తరణ
- మంత్రి పదవులకు రాజీనామా చేసిన పలువురు కీలక నేతలు
- రవిశంకర్ ను గవర్నర్ గా పంపే అవకాశం
కాసేపట్లో కేంద్ర కేబినెట్ ను ప్రధాని మోదీ విస్తరించనున్నారు. మరోవైపు కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. తాజాగా కీలక నేతలు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ లతో పాటు మొత్తం 12మంది తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు.
న్యాయ, ఎలక్ట్రానిక్ మరియు ఐటీ మంత్రిగా ఉన్న రవిశంకర్ ప్రసాద్ చివరి రోజుల్లో ట్విట్టర్ వంటి సంస్థలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఐటీ రూల్స్ ను పాటించడం లేదని, చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న ప్రకాశ్ జవదేకర్ కూడా తన పదవికి రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. మరోవైపు, రవిశంకర్ ప్రసాద్ ను గవర్నర్ గా పంపే అవకాశం ఉందంటూ ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి.
- రవిశంకర్ ప్రసాద్, లా అండ్ జస్టిస్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ మంత్రి
- ప్రకాష్ జవదేకర్, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి, సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి మరియు భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ సంస్థల మంత్రి.
- హర్ష్ వర్ధన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి
- రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, మానవ వనరుల అభివృద్ధి మంత్రి
- కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలో స్వతంత్ర బాధ్యత కలిగిన రాష్ట్ర మంత్రి సంతోష్ గంగ్వర్
- రసాయనాలు మరియు ఎరువుల మంత్రి సదానంద గౌడ
- దేబాశ్రీ చౌదరి, మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి
- సంజయ్ ధోత్రే, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రి
- తవార్ చంద్ గెహ్లోట్, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి
- బాబుల్ సుప్రియో, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి
- ప్రతాప్ సారంగి, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్య, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి
- రత్తన్ లాల్ కటారియా, జల్ శక్తి రాష్ట్ర మంత్రి