గచ్చిబౌలి స్టేడియంలో ఒలింపిక్స్ కు వెళ్లే క్రీడాకారుల సన్మాన కార్యక్రమంలో గందరగోళం
- రాష్ట్రం నుంచి టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే క్రీడాకారులు, కోచ్‌లకు సన్మానం
- వేదికపైకి వెళ్లేందుకు పీవీ సింధు, ఇతర క్రీడాకారుల నిరాకరణ
- కరోనా వేళ వేదికపై చాలా మంది ఉండడమే కారణం
- చివరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ జోక్యంతో వెళ్లిన క్రీడాకారులు
రాష్ట్రం నుంచి టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే క్రీడాకారులు, కోచ్‌లకు హైదరాబాదు, గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే, ఇందులో గందరగోళం నెలకొంది. వేదికపైకి వెళ్లేందుకు పీవీ సింధు, ఇతర క్రీడాకారులు, కోచ్‌లు నిరాకరించారు. కరోనా సమయంలో వేదికపై చాలా మంది ఉండడమే దీనికి కారణం.
చివరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ జోక్యంతో సింధుతో పాటు ఇతర క్రీడాకారులు వేదికపైకి వెళ్లారు. ఈ సందర్భంగా వారికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. తెలంగాణలో క్రీడల అభివృద్ధికి, సదుపాయాల కల్పనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ప్రోత్సాహకాలు ప్రకటించారని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత క్రీడాకారులకు ఇప్పటివరకు రూ.25.87 కోట్ల నగదు ప్రోత్సాహకాలను అందించామని చెప్పారు.