కెప్టెన్ కూల్ ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ!
- ఇవ్వాళ 40వ వసంతంలోకి మహేంద్రుడు
- సింపుల్ గా కోహ్లీ.. ఎమోషనల్ గా రైనా విషెస్
- ధోనీ గొప్ప నిర్ణయాలతో ఐసీసీ వీడియో
- ఒకే ఒక్కడంటూ చెన్నై సూపర్ కింగ్స్ పోస్ట్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇవ్వాళ్టితో 40వ పడిలోకి అడుగు పెట్టాడు. దేశానికి టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ అందించి ఆల్ టైం గ్రేటెస్ట్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ధోనీకి.. పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ ఆటగాడు సురేశ్ రైనాలు తమ స్టైల్ లో ధోనీకి శుభాకాంక్షలు చెప్పారు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు కెప్టెన్’ అంటూ కోహ్లీ సింపుల్ గా విషెస్ చెప్పేస్తే.. రైనా కాస్త భావోద్వేగపూరిత విషెస్ చెప్పాడు. ‘‘పుట్టిన రోజు శుభాకాంక్షలు ధోనీ. నువ్వే నా నేస్తం, నా సోదరుడు, నా గురువు. నాకన్నీ నువ్వే. కలకాలం ఆయురారోగ్యాలతో నువ్వు ఆనందంగా గడపాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఓ గొప్ప ఆటగాడిగా, గొప్ప నాయకుడిగా ఉన్నందుకు కృతజ్ఞతలు’’ అని ట్వీట్ చేశాడు. ఓ ఇంగ్లిష్ పాటను జోడించి ధోనీతో గడిపిన సందర్భాలను గుర్తు చేస్తూ వీడియోను పోస్ట్ చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా ధోనీకి విషెస్ చెప్పింది. అతడిని కెప్టెన్ కూల్ అనడానికి ఓ కారణముందంది. క్రికెట్ లో అతడు తీసుకున్న గొప్ప నిర్ణయాలతో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇటు చెన్నై సూపర్ కింగ్స్ కూడా తమ కెప్టెన్ కు హ్యాపీ బర్త్ డే చెప్పింది. ‘‘మా తలాకు సూపర్ బర్త్ డే. ఒక్కడు.. ఒకే ఒక్కడు.. ఇప్పుడూ.. ఎప్పుడూ”అంటూ ట్వీట్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం కొంచెం కొత్తగా విషెస్ చెప్పింది. ‘‘నంబర్ 7.. నువ్వెప్పుడూ అందరి నంబర్ 1’’ అంటూ ట్వీట్ చేసింది. ఓ కెప్టెన్ లో గొప్ప స్నేహితుడంటూ పేసర్ ఇషాంత్ హ్యాపీ బర్త్ డే చెప్పాడు.
‘‘మేం యువకులుగా ఉన్నప్పుడు ఎలా గెలవాలో దాదా మాకు చెప్పాడు. దానిని ధోనీ అలవాటుగా మార్చేశాడు. ఇద్దరు గొప్ప నాయకులు కేవలం ఒక్కరోజు తేడాతో పుట్టారు. భారత క్రికెట్ రూపురేఖలు, గతిని మార్చేసిన ఇద్దరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’’ అని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు. ఇక, ఇండియన్ టీమ్ మొత్తం అతడిని శుభాకాంక్షలతో ముంచెత్తింది. హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చహల్, ఉమేశ్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ వంటి వారు హ్యాపీ బర్త్ డే పోస్టులు పెట్టారు.