అవి నిరాధార వార్తలన్న ఉద్ధవ్ థాకరే!
- శివసేన, బీజీపీ మళ్లీ కలవబోతున్నాయంటూ ఊహాగానాలు
- ప్రచారాన్ని ఖండించిన ఉద్ధవ్
- బీజేపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాల్లో నానాయాగీ చేస్తున్నారని వ్యాఖ్య
- వారి తీరు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలాంటిదని ఆగ్రహం
మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. గతంలో ఎన్డీయేలో కొనసాగిన శివసేన మహారాష్ట్ర ఎన్నికల అనంతరం ఏర్పడిన అభిప్రాయ భేదాల కారణంగా, బయటకు వచ్చేసి కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, కొన్ని రోజులుగా శివసేన, బీజేపీ మళ్లీ కలవబోతున్నాయంటూ ఊహాగానాలు వస్తున్నాయి.
ఈ ప్రచారాన్ని తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ఖండించారు. ఇవి నిరాధారమైన వార్తలని ఉద్ధవ్ అన్నారు. బీజేపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాల్లో నానాయాగీ చేస్తున్నారని, వారి తీరు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలాంటిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించిన 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. కాగా, బీజేపీ మహారాష్ట్ర నేతలు కూడా శివసేనతో కలవబోమని స్పష్టం చేశారు. శివసేనతో మళ్లీ కలుస్తామంటూ వస్తోన్న వార్తలను కొట్టిపారేశారు.