రాజ్ నాథ్ నుంచి సుష్మ వరకు ఎందరో బీజేపీ నేతలను చూశా... కానీ ఈ బీజేపీ చాలా తేడా!: మమతా బెనర్జీ

  • జులై 2న బెంగాల్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం
  • గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలిన బీజేపీ సభ్యులు
  • మండిపడిన మమత
  • సభ్యత, సంస్కారాల్లేవని విమర్శలు
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై తన మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ జగ్దీప్ ధంకర్ ప్రసంగం సందర్భంగా బీజేపీ సభ్యులు రభస సృష్టించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లకు కనీస మర్యాద, సభ్యత తెలియదని విమర్శించారు. జులై 2న గవర్నర్ తన 18 పేజీల ప్రసంగంలో కొన్ని పంక్తులు చదివారో లేదో, ఎన్నికల అనంతర హింసపై నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేపట్టారు. దాంతో ఆయన ప్రసంగాన్ని ఆపేశారు.

దీనిపై ఇవాళ స్పందించిన మమతా బెనర్జీ... తాను రాజ్ నాథ్ నుంచి సుష్మ స్వరాజ్ వరకు ఎందరో బీజేపీ నేతలను చూశానని, కానీ ఈ బీజేపీ మాత్రం చాలా తేడా అని విమర్శించారు. వీళ్లకు సంస్కృతి గురించి ఏమీ తెలియదని, నాగరికత, సభ్యతాసంస్కారాల గురించి అసలు చెప్పనక్కర్లేదని వ్యాఖ్యలు చేశారు.


More Telugu News