అనంతపురంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ కాన్వాయ్ ని అడ్డుకున్న విద్యార్థి సంఘాలు

  • అనంతపురంలో నిరుద్యోగుల నిరసనలు
  • పాల్గొన్న పలు విద్యార్థి సంఘాలు
  • మంత్రి సురేశ్ కు నిరసన సెగ
  • కొత్త జాబ్ క్యాలెండరు డిమాండ్ చేసిన నిరుద్యోగులు
ఇవాళ అనంతపురంలో నిరుద్యోగులు మంత్రి ఆదిమూలపు సురేశ్ కాన్వాయ్ ని అడ్డుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, కొత్త జాబ్ క్యాలెండరు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే, నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వంగా వైసీపీ సర్కారు చరిత్రలో నిలిచిపోతుందని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ యూ, డీవైఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్ యూఐ తదితర విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.

నిరుద్యోగితను పారదోలుతామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారని, ఓట్లు వేయించుకున్నాక నిరుద్యోగుల జీవితాలను కకావికలం చేసేలా వైసీపీ సర్కారు చర్యలు ఉన్నాయని విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. నిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపైకి వస్తున్నా ప్రభుత్వంలో స్పందన కనిపించకపోవడం దారుణమని పేర్కొన్నారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం స్పందించకపోతే మున్ముందు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.


More Telugu News