లంచం తీసుకుంటూ రెండ్ హ్యాండెడ్ గా దొరికిన మియాపూర్ ఎస్‌ఐ

  • ఓ కేసు విషయంలో రూ. 20 వేలు డిమాండ్ చేసిన ఎస్ఐ
  • ఏసీబీకి ఫిర్యాదు చేసిన బాధితుడు
  • పీఎస్ లోనే ఎస్ఐని పట్టుకున్న ఏసీబీ
శాంతిభద్రతలను కాపాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరికీ అండగా నిలవాల్సిన కొందరు ఖాకీలు వక్రమార్గం పట్టి మొత్తం పోలీస్ వ్యవస్థకే మచ్చ తీసుకొస్తున్నారు. లంచాలు మరిగిన కొందరు అధికారులు ప్రజలను వేధిస్తూ జేబులు నింపుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ శివారు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఓ ఎస్ఐ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.

ఓ కేసుకు సంబంధించి సదరు ఎస్ఐ బాధితుడి నుంచి రూ. 20 వేల లంచం డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని సదరు వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, ఎస్సైను ట్రాప్ చేసిన ఏసీబీ అధికారులు రూ. 20 వేలు తీసుకుంటుండగా పీఎస్ లోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


More Telugu News