నెల్లూరు జిల్లా పెనుశిల అభయారణ్యంలో తప్పిపోయిన బాలుడు... డ్రోన్లతో రెస్క్యూ ఆపరేషన్
- 8 రోజులుగా ఆచూకీ లేని సంజు
- భారీస్థాయిలో రెస్క్యూ ఆపరేషన్
- సెర్చ్ ఆపరేషన్ లో పోలీసు జాగిలాలు
- కన్నీరుమున్నీరవుతున్న సంజు తల్లిదండ్రులు
నెల్లూరు జిల్లాలో 1000 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న పెనుశిల అభయారణ్యంలో సంజు అనే బాలుడు తప్పిపోయాడు. ఈ ఘటన జరిగి 8 రోజులు కాగా, అధికారులు భారీ ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పెద్ద సంఖ్యలో డ్రోన్ల సాయంతో బాలుడి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పోలీసు జాగిలాలు కూడా పాలుపంచుకుంటున్నాయి. అటవీశాఖ సిబ్బంది సాయంతో పెనుశిల అభయారణ్యంలోని ప్రతి ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. వారం రోజులు దాటినా తమ బిడ్డ ఆచూకీ తెలియకపోవడంతో సంజు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.