జగన్ రెండు రోజుల కడప పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదిగో!

  • ఈ నెల 8, 9 తేదీల్లో కడప జిల్లా పర్యటన
  • గన్నవరం నుంచి పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్న సీఎం
  • అనంతపురంలో కార్యక్రమాల తర్వాత కడప జిల్లాకు పయనం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారయింది. ఈ నెల 8, 9 తేదీల్లో జగన్ కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. సీఎం పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్ హరికిరణ్ వెల్లడించారు.

ముఖ్యమంత్రి పర్యటన వివరాలు.. 8వ తేదీన:
  • ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు పయనం.
  • 8.50 గంటలకు ప్రత్యేక విమానంలో బయల్దేరి 9.55 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు.
  • 10.40 గంటలకు అనంతపురంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం.
  • ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 1.45 గంటలకు పులివెందులకు చేరిక.
  • పులివెందులలో 2.00 గంటల వరకు తన నివాసంలో బస.
  • మధ్యాహ్నం 2.25 నుంచి 3.00 గంటల వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
  • 3.15 గంటలకు హెలికాప్టర్ లో బయల్దేరి 3.35కి ఇడుపులపాయకు చేరిక.
  • 4.00 గంటల నుంచి 4.45 వరకు వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు.
  • ఆ తర్వాత రాత్రి ఇడుపులపాయలోనే బస.

9వ తేదీ షెడ్యూల్:
  • ఉదయం 10.40 గంటలకు ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్ లో బద్వేలుకు చేరుకోనున్న సీఎం. 
  • 11.05 గంటలకు బహిరంగసభ.
  • అనంతరం వివిధ అభివృద్ధి పనులకు శిలాఫలకాల ఆవిష్కరణ.
  • 1.20 గంలకు కడపకు చేరుకోనున్న జగన్.
  • 2.05 గంటలకు వివిధ అభివృద్ది పనులకు సంబంధించి శంకుస్థాపనలు.
  • 3.45 గంటలకు వైయస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంకు చేరుకోనున్న సీఎం.
  • స్టేడియంలో అభివృద్ధి పనులకు శిలాఫలకం ఆవిష్కరణ.
  • సాయంత్రం 5 గంటలకు కడప ఎయిర్ పోర్టు నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు పయనం.


More Telugu News