థియేటర్లలోనే దిగుతానంటున్న 'నారప్ప'
- వెంకటేశ్ తాజా చిత్రంగా 'నారప్ప'
- తమిళ 'అసురన్'కి రీమేక్
- థియేటర్ రిలీజ్ పైనే దృష్టి
- త్వరలో రానున్న స్పష్టత
వెంకటేశ్ కథానాయకుడిగా 'నారప్ప' సినిమా రూపొందింది. తమిళంలో ధనుశ్ హీరోగా నిర్మితమైన 'అసురన్'కి ఇది రీమేక్. తమిళంలో 'అసురన్' భారీ విజయాన్ని సాధించింది .. ధనుశ్ కెరియర్లోనే ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. వసూళ్ల పరంగా చూస్తే మంచి లాభాలను తెచ్చిపెట్టింది. వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. అలాంటి ఈ సినిమాను 'నారప్ప' పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, వెంకటేశ్ భార్య పాత్రలో ప్రియమణి కనిపించనుంది.
ఈ సినిమాను ముందుగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా పరిస్థితులు అనుకూలించకపోవడంతో, ఓటీటీ వైపు వెళుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. నేరుగా ఓటీటీలోనే విడుదల చేయనున్నారనే టాక్ బయటికి వచ్చేసింది. అయితే ఈ విషయంలో వెంకీ అభిమానులు పూర్తి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. అంతేకాదు త్వరలో థియేటర్లు ఓపెన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందువలన ముందుగా థియేటర్లలోనే వదిలి, ఆ తరువాతనే ఓటీటీకి వెళదామని మేకర్స్ ఆలోచన చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. చివరిగా ఏ నిర్ణయానికి వస్తారో చూడాలి మరి.