అంతర్వేది రథం దగ్ధం కేసు.. రోడ్డు ప్రమాదంలో మరణించిన అనుమానితుడు

  • మతిస్థిమితం కోల్పోవడంతో విశాఖలో చికిత్స
  • విచారణ అనంతరం వదిలేసిన పోలీసులు
  • అప్పటి నుంచి పోలీస్ స్టేషన్ బయటే ఉంటున్న అలీ
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి రథం అగ్నికి ఆహుతైన ఘటనలో అనుమానితుడైన యాకోబ్ అలీ (50) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అతడు మరణించినట్టు ఎస్సై గోపాలకృష్ణ నిన్న తెలిపారు.

రథం దగ్ధం కేసులో పోలీసులు గతంలో అలీని అదుపులోకి తీసుకున్నారు. మతిస్థిమితం కోల్పోవడం, భాష అర్థం కాకపోవడంతో విశాఖపట్టణంలో అలీకి చికిత్స చేయించారు. ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఉంచి విచారణ చేపట్టిన అనంతరం వదిలేశారు. అప్పటి నుంచి పోలీస్ స్టేషన్ బయటే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి రోడ్డుపై పడుకుని ఉండడంతో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అలీని ఢీకొట్టిన వాహనం విశాఖపట్టణానికి చెందినదిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.


More Telugu News