ఏపీలో కొత్తగా 2,100 కరోనా పాజిటివ్ కేసులు
- ఏపీలో మరికాస్త తగ్గిన కరోనా వ్యాప్తి
- 24 గంటల్లో 72,731 కరోనా పరీక్షలు
- తూర్పు గోదావరి జిల్లాలో 583 కేసులు
- అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 22 కేసులు
- రాష్ట్రంలో 26 మరణాలు
ఏపీలో గడచిన 24 గంటల్లో 72,731 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,100 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 583 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 316 కేసులు వచ్చాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 22 కేసులను గుర్తించారు. శ్రీకాకుళంలో 48, కర్నూలులో 50, అనంతపురంలో 60, విశాఖ జిల్లాలో 75 కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో 3,435 మందికి కరోనా నయం కాగా, 26 మంది మరణించారు. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున కరోనాకు బలయ్యారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 19,05,023 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 18,58,189 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 33,964 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 12,870కి పెరిగింది.