కర్నూలు జిల్లాలో నిరుద్యోగ యువకుడి ఆత్మహత్య బాధాకరం: నారా లోకేశ్
- నిరుద్యోగి బలవన్మరణం అంటూ వార్త
- స్పందించిన లోకేశ్
- జగన్ హామీ నిలుపుకోలేదని వ్యాఖ్యలు
- నిరుద్యోగులు నిరుత్సాహం వీడాలని పిలుపు
- ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని స్పష్టీకరణ
ఉద్యోగం రాలేదంటూ కర్నూలు జిల్లాలో ఓ యువకుడి ఆత్మహత్య నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండేళ్లయినా, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 2.30 లక్షల ఉద్యోగాల భర్తీకి ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. అందువల్లే రోజుకొక నిరుద్యోగి బలవన్మరణం వార్త వినాల్సి వస్తోందని మండిపడ్డారు.
బీఈడీ పూర్తిచేసి టీచర్ ఉద్యోగం సాధించాలనే కలలు కల్లలయ్యానే మనస్తాపంతో కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం గోపాలనగరం గ్రామానికి చెందిన నాగేంద్రప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని లోకేశ్ వివరించారు. నిరుద్యోగ యువకుడి ఆత్మహత్య బాధాకరమని, అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నానని పేర్కొన్నారు.
నిరుద్యోగులారా నిరుత్సాహం వద్దు, కలిసి పోరాడదాం అని లోకేశ్ పిలుపునిచ్చారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కానేకాదని స్పష్టం చేశారు.