వైసీపీ నేతల వ్యాఖ్యలు వారి దిగజారుడు తనానికి నిదర్శనం: పీతల సుజాత ఆగ్రహం
- రేవంత్ ను చంద్రబాబు పీసీసీ అధ్యక్షుడిగా చేశారనడం హాస్యాస్పదం
- వైసీపీ పాలనలో ఉద్యోగుల జీతాలకు కూడా అప్పులు చేస్తున్నారు
- ఏపీ నీటిని తెలంగాణ అక్రమంగా వాడుకుంటోంది
వైసీపీ నేతలపై తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా చంద్రబాబు నియమించారంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమని చెప్పారు. ఇలాంటి చౌకబారు విమర్శలు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు.
టీడీపీ హయాంలో ఐదేళ్ల కాలంలో ఏపీ ఎంతో అభివృద్ధిని సాధించిందని... అయితే వైసీపీ రెండేళ్ల పాలనలో మొత్తం పరిస్థితి మారిపోయిందని, ఒకటో తారీఖు వస్తోందంటే ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు అప్పు ఎక్కడ దొరుకుతుందా? అని రాష్ట్ర ప్రభుత్వం పరుగులు తీస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ అక్రమంగా నీటిని వాడుకుంటోందని, ఇదే సమయంలో ఏపీపైనే విమర్శలు గుప్పిస్తోందని దుయ్యబట్టారు.