వైయస్ లాంటి ఒక పెద్ద మనిషిని పట్టుకుని ఆ మాటలు ఎలా అంటారు?: జేసీ ప్రభాకర్ రెడ్డి

  • వైయస్ ను తెలంగాణ నేతలు బూతులు తిడుతున్నారు
  • ఎప్పుడూ బూతులు మాట్లాడే ఏపీ మంత్రులు ఏం చేస్తున్నారు?
  • హైదరాబాదులో సెటిలర్లు ఎవరూ లేరు
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ నేతల తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు.

వైయస్ తనకు ఆప్తుడని, ఇష్టమైన నాయకుడని జేసీ అన్నారు. వైయస్సార్ ను ఉద్దేశించి రాక్షసుడని, తెలంగాణకు ద్రోహం చేసినవాడని ఆ రాష్ట్ర మంత్రులు విమర్శలు చేయడం సరికాదని ఆయన చెప్పారు. వైయస్ లాంటి ఒక పెద్ద మనిషిని పట్టుకుని రాక్షసుడని ఎలా అంటారని మండిపడ్డారు.

వైయస్ ను పక్క రాష్ట్ర నేతలు బండ బూతులు తిడుతుంటే రాష్ట్ర మంత్రులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. విపక్షాలపై బూతులతో విరుచుచుపడే ఏపీ మంత్రులు ఇప్పుడు చేతులకు గాజులు తొడుక్కున్నారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో సెటిలర్లు ఎవరూ లేరని... తమ పిల్లలు అక్కడే పుట్టి, అక్కడే చదువుకున్నారని అన్నారు. ఏపీలో ఉన్న ప్రజలు కూడా హైదరాబాదుకి వెళ్లి షాపింగులు చేస్తున్నారని చెప్పారు.


More Telugu News