ప్రశ్నిస్తే గ్రామస్థులపై లాఠీఛార్జ్ చేస్తారా?: దేవినేని ఉమ
- ఇళ్ల పట్టాలు వైసీపీ నాయకులకేనా?
- అనర్హులకు ఇచ్చారని ప్రశ్నిస్తే లాఠీఛార్జ్ చేస్తారా?
- అరాచకాలపై ప్రజలు పిడికిలి బిగిస్తున్నారు
- మార్పుమొదలైంది తెలుసుకోండి వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. బొబ్బిలిలో గ్రామస్థులపై లాఠీఛార్జ్ చేశారని తెలుపుతూ, ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రశ్నిస్తే దాడులు చేయడం ఏంటని ఆయన నిలదీశారు.
'ఇళ్ల పట్టాలు వైసీపీ నాయకులకేనా? అనర్హులకు ఇచ్చారని ప్రశ్నిస్తే బొబ్బిలిలో గ్రామస్థులపై లాఠీఛార్జ్ చేస్తారా? నందివాడ తమిరిశ, జి.కొండూరు మునగపాడులోనూ గందరగోళం. శంకుస్థాపనల వద్ద పరాభవం. మీ ఏకపక్ష నిర్ణయాలు, అరాచకాలపై ప్రజలు పిడికిలి బిగిస్తున్నారు. మార్పుమొదలైంది తెలుసుకోండి వైఎస్ జగన్' అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.