కమల్ 'విక్రమ్' పైనే ఆందరి దృష్టి!

  • కమల్ సొంత సినిమాగా 'విక్రమ్'
  • నలుగురు విలన్లతో నడిచే కథ
  • సంగీత దర్శకుడిగా అనిరుధ్ 
  • అందరిలో పెరుగుతున్న అంచనాలు  
కమలహాసన్ కథానాయకుడిగా సెట్స్ పైకి వెళ్లిన 'ఇండియన్ 2' మూవీ సంగతి ఎటూ తేలకుండా ఉంది. దాంతో ఇక ఆలస్యం చేయకూడదనే ఉద్దేశంతో ఒక వైపున 'పాపనాశం' సీక్వెల్ ను పట్టాలెక్కించే ప్రయత్నాలు చేస్తూనే, మరో వైపున తన సొంత బ్యానర్లో 'విక్రమ్' సినిమాను నిర్మిస్తున్నాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం కమల్ భారీస్థాయిలో ఖర్చు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో కమల్ ఒక చిత్రమైన స్వభావం కలిగిన పాత్రలో కనిపిస్తూ ఉండటం ఆసక్తిని పెంచే అంశంగా మారింది.

ఈ సినిమాలో నలుగురు ప్రతినాయకులు ఉండనున్నారనే విషయం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక ప్రతినాయకుడిగా ఫాహద్ ఫాజిల్ ను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. మిగిలిన మూడు పాత్రలలో విజయ్ సేతుపతి .. నరేన్ .. అర్జున్ దాస్ ను ఎంపిక చేశారు ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాను చూస్తున్నంత సేపు ఒక హాలీవుడ్ మూవీని చూస్తున్నట్టుగా అనిపిస్తుందని లోకేశ్ కనగరాజ్ చెప్పడం విశేషం. ఇక ఇదే టైటిల్ తో 1986లో కమల్  చేసిన సినిమా, భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.


More Telugu News