కాంగ్రెస్ పార్టీ లోక్ సభ పక్ష నేతగా శశి థరూర్? అధిర్ పై వేటుకు సిద్ధమవుతున్న సోనియా

  • బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్న అధిర్
  • అధిర్ వల్ల మమతతో చేతులు కలపలేకపోతున్న కాంగ్రెస్
  • తొలి నుంచి మమతకు వ్యతిరేకంగానే ఉన్న అధిర్
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. తమ పార్టీ లోక్ సభాపక్ష నేతను మార్చే యోచనలో ఉంది. ప్రస్తుతం ఈ బాధ్యతను సీనియర్ నేత అధిర్ రంజన్ చౌధురి నిర్వహిస్తున్నారు. ఆయన స్థానంలో శశి థరూర్ ని కానీ, మరో సీనియర్ నేత మనీశ్ తివారీని కాని నియమించాలని భావిస్తున్నట్టు సమాచారం.

 అధిర్ రంజన్ చౌధురి పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అయితే, ఇటీవల బెంగాల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. దీంతో, అధిర్ ను పదవులను నుంచి తొలగించాలని ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ భావిస్తున్నారు.

బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీతో పొత్తు పెట్టుకోవడానికి అధిర్ అంగీకరించలేదు. ఇంకా చెప్పాలంటే, మమత కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఆమెకు అధిర్ వ్యతిరేకమే. మమత సొంత పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆయన అదే ధోరణిని అవలంబిస్తూ వస్తున్నారు. అధిర్ తీరు వల్ల జాతీయ స్థాయిలో మమతతో కలిసి బీజేపీపై పోరాటం చేయడానికి కూడా కాంగ్రెస్ కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆయనను తొలగించేందుకు పార్టీ హైకమాండ్ అడుగులు వేస్తున్నట్టు చెపుతున్నారు.


More Telugu News