బ్రిటీష్ సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీకొన్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు: సీఎం జగన్

  • నేడు అల్లూరి జయంతి
  • ఘన నివాళి అర్పించిన సీఎం జగన్
  • తెగువకు నిలువెత్తు నిదర్శనమని వ్యాఖ్యలు
  • అల్లూరి జీవితం స్ఫూర్తిదాయకమని వెల్లడి
కేవలం విల్లు, బాణాలు, గుండె నిండా స్థయిర్యంతోనే బ్రిటీష్ సేనలకు ఎదురొడ్డి నిలిచిన మన్యం మొనగాడు అల్లూరి సీతారామరాజు. ఇవాళ ఆ మహనీయుని జయంతి. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ స్పందించారు. ప్రజల హక్కుల కోసం, స్వాతంత్ర్య పోరాటం కోసం బ్రిటీష్ సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీకొన్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని కీర్తించారు.

తెలుగుజాతి తెగువకు నిలువెత్తు నిదర్శనమైన మన్యం వీరుడు అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. నేడు అల్లూరి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు. తన కార్యాలయంలో అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అవంతి శ్రీనివాసరావు, పేర్ని నాని తదితరులు పాల్గొన్నారు.


More Telugu News