రాజకీయాల్లో మోసం చేయడం, పార్టీలు మారడం సాధారణ విషయమే: డీకే శివ కుమార్
- ప్రభుత్వాన్ని కూల్చేసిన 17 మంది ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్‌లోకి రావచ్చు
- బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్‌ను చేర్చుకున్నాం
- పార్టీలో చేరాలనుకుంటే కాంగ్రెస్ కమిటీకి దరఖాస్తులు పంపించాలి
కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరడంతో కర్ణాటకలో గతంలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. అయితే, తమ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతలు మళ్లీ తమ పార్టీలో చేరాలని కాంగ్రెస్ నేత డీకే శివ కుమార్ పిలుపునిచ్చారు.
రాజకీయాల్లో మోసం చేయడంతో పాటు పార్టీలు మారడం కూడా సాధారణ విషయమేనని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. సంకీర్ణ కూటమిని కూల్చేసిన 17 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇంకా ఇతరులు ఎవరైనా కాంగ్రెస్ లో చేరాలని అనుకుంటే రావచ్చని తెలిపారు.
ఇప్పటికే తాము బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్‌ను చేర్చుకున్నామని శివ కుమార్ అన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను అంగీకరించేవారెవరైనా సరే తమ పార్టీలో చేరవచ్చని తెలిపారు. తమ పార్టీలో చేరాలనుకుంటే కాంగ్రెస్ కమిటీకి దరఖాస్తులు పంపించాలని చెప్పారు. కాంగ్రెస్ నేతల్లో వేర్వేలు అభిప్రాయాలు ఉండవచ్చని, అయితే, వ్యక్తిగత అభిప్రాయాల కన్నా పార్టీ నిర్ణయమే అందరికీ ముఖ్యమని ఆయన చెప్పారు.