శ్రీశైలం పుణ్య‌క్షేత్రం వ‌ద్ద డ్రోన్ల సంచారం.. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు

  • కెమెరాల‌తో కూడిన‌ డ్రోన్ల సంచారం
  • అర్ధరాత్రి సమయంలో తిరుగుతోన్న‌ డ్రోన్లు
  • నల్లమల్ల ఫారెస్ట్ పరిసరాల్లో గాలింపు చ‌ర్య‌లు  
శ్రీశైలం పుణ్య‌క్షేత్రం వ‌ద్ద నాలుగు రోజులుగా కెమెరాల‌తో కూడిన‌ డ్రోన్ల సంచారం అల‌జ‌డి రేపుతోంది. అర్ధరాత్రి సమయంలో ఈ డ్రోన్లు తిరుగుతున్నాయి. అవి ఎక్క‌డి నుంచి వ‌స్తున్నాయ‌న్న విష‌యంపై పోలీసులు, అటవీశాఖ అధికారులు దృష్టి పెట్టారు. డ్రోన్లను పట్టుకునేందుకు వారు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ప్ప‌టికీ అవి వారికి చిక్క‌డం లేదు. అనుమానాస్ప‌ద రీతిలో తిరుగుతోన్న ఆ డ్రోన్ల విష‌యంలో అప్ర‌మ‌త్తమైన పోలీసులు శ్రీశైలం చుట్టూ ఉన్న‌ నల్లమల్ల ఫారెస్ట్ పరిసరాల్లో గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.



More Telugu News