స్కూళ్లు తెరవాలంటూ గేదెతో నిరసన.. వారిని చూసి బెదిరిపోయి పరుగులు తీసిన వైనం!
- మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో ఘటన
- నిరసనకారులు చుట్టుముట్టడంతో భయపడి తప్పించుకునే ప్రయత్నం
- మహిళకు గాయాలు
గేదెతో నిరసన తెలిపేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అంతమంది జనాన్ని చూసిన గేదె బెదిరిపోయి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నంలో ఓ మహిళ గాయపడింది. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కరోనా మహమ్మారి కారణంగా గత విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలు మూతబడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెరుచుకోలేదు. అయితే, ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిరసనకు దిగాయి.
ఇందులో భాగంగా ఓ గేదెను తీసుకొచ్చి నిరసన ప్రదర్శన నిర్వహించారు. అయితే, అంతమందిని, ఆ హడావుడిని చూసి భయపడిన గేదె తప్పించుకునే ప్రయత్నం చేసింది. వారిపైకి దూసుకెళ్లడంతో నిరసనకారులు చెల్లాచెదురయ్యారు. ఈ క్రమంలో ఓ మహిళ గాయపడింది. ఆ తర్వాత గేదెను అదుపు చేయడంతో నిరసనకారులు ఊపరి పీల్చుకున్నారు.