మావోయిస్టులు వాడే భాషను రేవంత్ రెడ్డి వాడుతున్నారు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర
- ఐపీసీ 502, 503 కింద రేవంత్ శిక్షార్హుడు
- మావోల భాషను వాడిన రేవంత్ ను నిషేధిత జాబితాలో పెట్టాలి
- రేవంత్ రాజకీయంగా ఎదగడమే వివాదాస్పదం
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేత, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రేవంత్ రాజకీయంగా ఎదగడమే వివాదాస్పదమని ఆయన అన్నారు. నిషేధిత సంస్థలైన మావోయిస్టులు వాడే భాషను రేవంత్ వాడుతున్నారని దుయ్యబట్టారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన ఐపీసీ 502, 503 సెక్షన్ల కింద శిక్షార్హుడని అన్నారు. మావోయిస్టుల భాషను వాడిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని, ఆ పార్టీని నిషేధిత జాబితాలో పెట్టాలని డిమాండ్ చేశారు.
2017లో రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి బయటకు వచ్చినా... ఆయన ఎమ్మెల్యే పదవీ కాలం ముగిసేంత వరకు ఎమ్మెల్యేగా కొనసాగింది నిజం కాదా? అని గండ్ర ప్రశ్నించారు. రేవంత్ ను పీసీసీ అధ్యక్షుడిగా చేయకపోతే... ఆయన ఆ పార్టీలో కొనసాగేవారా? అని నిలదీశారు.