సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ పై ఫిర్యాదు విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలంటూ ఏపీ సీఎస్ కు కేంద్ర హోంశాఖ లేఖ
- సునీల్ ప్రసంగాలపై కేంద్రానికి రఘురామ లేఖ
- స్పందించిన కేంద్ర హోంశాఖ
- సునీల్ కుమార్ పై అవసరమైతే చర్యలు తీసుకోవాలని ఆదేశం
- త్వరగా నివేదిక ఇవ్వాలని స్పష్టీకరణ
ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని గతంలో కేంద్రానికి ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ప్రసంగాల వీడియోలు సమర్పించి, చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల్లో అశాంతి రేకెత్తించేలా ప్రసంగించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ స్పందించింది. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై ఫిర్యాదు విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి సంజీవ్ కుమార్ ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు. ఆ చర్యల వివరాలకు సంబంధించి త్వరగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు.