కరోనా టీకా ఒక్క డోసు తీసుకున్నా మరణాల నుంచి 92% రక్షణ: కేంద్ర ప్రభుత్వ అధ్యయనంలో వెల్లడి

  • రెండు డోసులతో 98% భద్రత
  • పంజాబ్ పోలీసులపై అధ్యయనం
  • వివరాలను వెల్లడించిన నీతిఆయోగ్ సభ్యుడు
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుంటే మహమ్మారి మరణాల ముప్పును 98 శాతం తగ్గించవచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క డోసు తీసుకున్నా ఆ ముప్పు 92 శాతం తక్కువగా ఉంటుందని పేర్కొంది. పంజాబ్ లో వ్యాక్సిన్ తీసుకున్న పోలీసులపై చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలిందని తెలిపింది. ఆ అధ్యయన సమాచారాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ వెల్లడించారు.

35,856 మంది పోలీసులు ఒక్కడోసు వ్యాక్సిన్ తీసుకుంటే.. అందులో కరోనా సోకి 9 మంది చనిపోయారని, వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందిలో కరోనాతో చనిపోయింది 0.25 శాతమేనని చెప్పారు. రెండు డోసులు తీసుకున్న 42,720 మందిలో కేవలం ఇద్దరే (0.05%) చనిపోయారన్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకోని 4,868 మంది సిబ్బందిలో 15 మంది మృత్యువాత పడ్డారన్నారు. కాబట్టి వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా తీవ్రత తగ్గడమే కాకుండా మరణాల ముప్పునూ గణనీయంగా తగ్గించొచ్చని, అందరూ ధైర్యంగా టీకాలు వేసుకోవాలని ఆయన సూచించారు.


More Telugu News