ఇంగ్లిషులో కొత్త పదాన్ని నేర్చుకున్నానంటూ మోదీ గడ్డాన్ని గుర్తు చేసిన శశిథరూర్!
- ఓ నెటిజన్ చేసిన ట్వీట్ కు రిప్లై
- కొత్తగా పొగనోట్రొఫీ అనే పదాన్ని నేర్చుకున్నానన్న థరూర్
- అంటే గడ్డాన్ని పెంచడం అని వివరణ
కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ కు ఆంగ్లభాష పరిజ్ఞానం చాలా ఉన్నప్పటికీ, ఆయన ప్రతిరోజు కొత్త కొత్త పదాలను నేర్చుకుంటూనే ఉంటారు. చాలా కష్టంగా ఉండే కొత్త పదాలను కూడా నేర్చుకుంటూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తారు. తాను నేర్చుకున్న కొత్త పదాల గురించి సామాజిక మాధ్యమాల ద్వారా నెటిజన్లకు తెలుపుతుంటారు. తాజాగా ఆయన మరో కొత్త పదం నేర్చుకున్నారట.
'మీ నుంచి మరో కొత్త పదాన్ని నేను నేర్చుకోవాలనుకుంటున్నాను' అంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్ కు రిప్లై ఇస్తూ శశిథరూర్ ఈ విషయం తెలిపారు. తాను కొత్తగా పొగనోట్రొఫీ అనే పదాన్ని నేర్చుకున్నానని థరూర్ పేర్కొన్నారు. అంటే గడ్డాన్ని పెంచడం అని చెప్పారు. 'కరోనా వైరస్ సంక్షోభం ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీ గడ్డం పెంచుతున్నారు కదా అలా..' అంటూ ఆయన చమత్కరించారు. ఈ పదాన్ని తన మిత్రుడు రితిన్ రాయ్ అనే ఆర్థికవేత్త తనకు నేర్పించారని ఆయన పేర్కొన్నారు.