శ్రీవారి ఆన్‌లైన్ టికెట్లను ఇప్పట్లో పెంచే యోచన లేదు: టీటీడీ
- కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిన తర్వాత ఆలోచిస్తామన్న టీటీడీ
- సామాన్య భక్తులకు నిరాశ
- శ్రీవారి జిలేబీ, మురుకుల ప్రసాదం ధరల పెంపు
కరోనా వైరస్ తీవ్రత ఇంకా కొసాగుతూనే ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తిరుమల శ్రీవారి ఆన్‌లైన్ టికెట్లను పెంచే ఉద్దేశం లేదని టీటీడీ పేర్కొంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాతే దీని గురించి ఆలోచిస్తామని టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్, ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. దీంతో సర్వదర్శనం కోసం సామాన్య భక్తులు మరికొంత కాలం వేచి చూడక తప్పేలా కనిపించడం లేదు.
మరోవైపు, శ్రీవారి జిలేబీ, మురుకుల ప్రసాదం ధరలను టీటీడీ పెంచింది. శ్రీవారికి ప్రతి గురువారం నిర్వహించే తిరుప్పావడ సేవ సమయంలో జిలేబీతోపాటు మురుకులను నివేదిస్తుంటారు. తిరుప్పావడ టికెట్లు కొనుగోలు చేసి శ్రీవారి సేవలో పాల్గొనే భక్తులకు వీటిని ఇస్తుంటారు. వీటికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రూ. 100గా ఉన్న ధరను రూ. 500కు పెంచింది. కాగా, చిన్న, పెద్ద లడ్డూలు, వడల ధరలను టీటీడీ ఇప్పటికే పెంచింది.