జులై 19 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
- వర్షాకాల సమావేశాలకు పార్లమెంటు సన్నద్ధత
- ఆగస్టు 13 వరకు సమావేశాలు
- 20 సార్లు భేటీ కానున్న ఉభయ సభలు
- కొవిడ్ మార్గదర్శకాలతో సమావేశాలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలను జులై 19 నుంచి నిర్వహించనున్నారు. వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఉభయ సభలు సుమారు 20 సార్లు భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 13న ముగియనున్నాయి. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో పార్లమెంటు ప్రాంగణంలో అన్ని కొవిడ్ నిబంధనలు, మార్గదర్శకాలు పాటించనున్నారు.
ఇప్పటివరకు 400 మంది వరకు పార్లమెంటు సభ్యులకు కరోనా వ్యాక్సిన్ అందించారు. అయితే, ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని పార్లమెంటు వర్గాలంటున్నాయి. ఎంపీలు తమ రాష్ట్రాలలో టీకాలు తీసుకునే అవకాశాలున్నాయని వివరించారు. కాగా, లోక్ సభ, రాజ్యసభ సమావేశాలు కవర్ చేసే పాత్రికేయులకు కూడా వ్యాక్సిన్ అందించేందుకు పార్లమెంటు వర్గాలు సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో, ఇంతకుముందు రాజ్యసభ సమావేశాలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, కొన్ని సందర్భాల్లో 2 గంటల వరకు నిర్వహించారు. లోక్ సభ సమావేశాలను సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభించారు. ఈసారి కూడా అదే రీతిలో నిర్వహించనున్నట్టు సమాచారం.