వచ్చేనెల నుంచే ఎన్టీఆర్ తో కొరటాల సినిమా!

  • ముగింపు దశలో 'ఆచార్య'
  • నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ తో 
  • అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం  
  • కీలకపాత్రలో సంపత్ రాజ్
కొరటాల .. ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా ఎప్పుడు పట్టాలపైకి వెళ్లనుందా అని అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. వచ్చేనెలలో ఈ  సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుందనే టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ కొరటాల బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఉన్నాడు. ప్రస్తుతం పాత్రలకి తగిన ఆర్టిస్టులను ఎంపిక చేసే పనిలో ఉన్నాడని అంటున్నారు. కథనాయికగా కైరా అద్వాని పేరు వినిపిస్తోంది. ఇక ఒక కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ ను ఎంపిక చేసే పనిలో ఉన్నారని అంటున్నారు.

ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచంద్రన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం కొరటాల 'ఆచార్య' సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఇక 'ఆర్ఆర్ఆర్'లలో తన పోర్షన్ ను పూర్తిచేసే పనిలో ఎన్టీఆర్ ఉన్నాడు. ఈ నెలలో ఈ పనులన్నీ కానిచ్చేసి, వచ్చేనెలలో రెగ్యులర్ షూటింగుకి వెళతారన్న మాట. ఈ సినిమాలో సంపత్ రాజ్ కి ఒక కీలకమైన పాత్ర దక్కనుందనే టాక్ బలంగానే వినిపిస్తోంది.


More Telugu News