పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కూలి పనులకు వెళ్లడం దారుణం: చంద్రబాబు

  • కరోనా వ్యాప్తితో మూతపడిన పాఠశాలలు
  • ఉపాధి కోల్పోయిన ప్రైవేటు టీచర్లు
  • ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు
  • ప్రభుత్వంలో చలనం లేదని విమర్శలు
కరోనా మహమ్మారి కారణంగా మధ్య తరగతి, పేదల జీవితాలు కుదుపులకు లోనయ్యాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయిన ప్రజలు తీవ్ర కష్టాల పాలవుతున్నారు. అలాంటి వారిలో ప్రైవేటు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కూలి పనులకు వెళ్లడం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రైవేటు ఉపాధ్యాయులకు ఈ దుస్థితి వచ్చిందని అన్నారు. ప్రైవేటు టీచర్లను ఆదుకోవాలని కోరినా ప్రభుత్వంలో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉపాధి కోల్పోయిన టీచర్ల కుటుంబాలకు రూ.10 వేలు తక్షణ సాయంగా అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కరోనా పరిస్థితులు ఉన్నంతకాలం ప్రైవేటు టీచర్లకు నెలకు రూ.7,500 చొప్పున ఇవ్వాలని స్పష్టం చేశారు.


More Telugu News