కరోనాను కట్టడి చేయడానికి ఇదొక్కటే మార్గం: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- వ్యాక్సిన్ తీసుకోవడం మినహా మరో దారి లేదు
- ఆఫ్రికా దేశాలకు వ్యాక్సిన్ అందని పరిస్థితి ఉంది
- సెప్టెంబర్ నాటికి అన్ని దేశాల్లో కనీసం 10 శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావాలి
కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి వ్యాక్సిన్ తీసుకోవడం మినహా మరో మార్గం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగాల్సిన అవసరం ఉందని తెలిపింది. ధనిక దేశాల్లో వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతున్నప్పటికీ.. పేద దేశాల్లో మాత్రం నెమ్మదిగా సాగుతోందని వ్యాఖ్యానించింది.
ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లోని ప్రజలకు వ్యాక్సిన్లు అందని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు పేద దేశాలకు వ్యాక్సిన్ ను పంపిణీ చేసేందుకు డబ్ల్యూహెచ్ఓ కోవాక్స్ ను ఏర్పాటు చేసింది. కోవాక్స్ కు వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న దేశాలు, ధనిక దేశాలు టీకాలను అందిస్తున్నాయి.
సెప్టెంబర్ నాటికి ప్రతి దేశంలో కనీసం 10 శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావాలని డబ్ల్యూహెచ్ఓ టార్గెట్ గా పెట్టుకుంది. ఈ ఏడాది చివరి నాటికి 40 శాతం, వచ్చే ఏడాది మధ్య కాలానికి 70 శాతానికి పైగా వ్యాక్సిన్ అందించాలని చెప్పింది. ఈ మేరకు వ్యాక్సినేషన్ జరిగితేనే కరోనాను ఎదుర్కొనగలమని, అప్పుడే ప్రపంచం ఆర్థికపరంగా మళ్లీ పరుగులు పెట్టే అవకాశం ఉంటుందని తెలిపింది.