భారీ రేటుకు 'మేజర్' హిందీ శాటిలైట్ రైట్స్!
- ముగింపు దశలో 'మేజర్'
- దేశభక్తి నేపథ్యంలో సాగే కథ
- సయీ మంజ్రేకర్ పరిచయం
- కీలకపాత్రల్లో ప్రకాశ్ రాజ్ .. రేవతి
మొదటి నుంచీ కూడా అడివి శేష్ విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. సస్పెన్స్ తో కూడిన యాక్షన్ సినిమాలు ఆయనకి మంచి పేరు తెచ్చిపెడుతున్నాయి. ఆయన తాజా చిత్రంగా 'మేజర్' రూపొందుతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్రగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా 80 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుందని అంటున్నారు. కరోనా తీవ్రత తగ్గడం వలన, మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది.
'గూఢచారి' సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న శశికిరణ్ తిక్క ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆ మధ్య వదిలిన ఈ సినిమా టీజర్ కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. సాధారణంగా దేశభక్తి నేపథ్యంలో రూపొందే సినిమాలు భాషతో సంబంధం లేకుండా ఆదరణ పొందుతూ ఉంటాయి. అందువలన ఈ సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లోను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా హిందీ శాటిలైట్ హక్కులు 10 కోట్లకు అమ్ముడైనట్టుగా చెబుతున్నారు. కథానాయకుడితో నడిచే పాత్రల్లో సయీ మంజ్రేకర్ .. శోభిత ధూళిపాళ్ల కనిపించనున్నారు. కీలకమైన పాత్రలను ప్రకాశ్ రాజ్ .. రేవతి పోషిస్తున్నారు.