జమ్మూకశ్మీర్‌లో మరోసారి సంచరించిన డ్రోను
- అర్నియా అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఘటన
- పాక్ భూభాగం వైపు ఫెన్సింగుకు అవతల డ్రోను
- కాల్పులు జరిపిన బీఎస్ఎఫ్ జవాన్లు
- తిరిగి పాకిస్థాన్ వైపు వెళ్లిపోయిన డ్రోన్
జమ్మూకశ్మీర్‌లో ఓ డ్రోను మరోసారి కలకలం రేపింది. ఈ రోజు తెల్లవారుజామున అర్నియా అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఓ డ్రోన్ సంచరించింది. పాకిస్థాన్ నుంచి దూసుకొచ్చి సరిహద్దుల్లోని జుమ్మత్ పోస్టు వద్ద ఇది తిరుగుతూ కనపడింది. పాక్ భూభాగం వైపు ఫెన్సింగుకు అవతల దీన్ని చూసిన బీఎస్ఎఫ్ జవాన్లు దానిపై కాల్పులు జరిపారు. దీంతో ఆ డ్రోన్ తోకముడిచి తిరిగి పాకిస్థాన్ వైపు వెళ్లిపోయింది.
డ్రోన్ కెమెరాతో అక్కడి ప్రాంతాలను చిత్రీకరించడానికి ప్రయత్నాలు జరిపినట్లు భారత సైనికులు భావిస్తున్నారు. జమ్ము ఎయిర్‌పోర్టులోని ఐఏఎఫ్ ఎయిర్ బేస్ వద్ద డ్రోన్లతో దాడి జరిగిన అనంతరం మళ్లీ పదే పదే డ్రోన్లు సంచరిస్తూ ఆందోళన రేపుతోన్న విషయం తెలిసిందే. జమ్ములో డ్రోన్లు కనపడడం ఇది ఐదో సారి. దీంతో ఇప్పటికే అప్రమత్తమైన భారత సైన్యం పాక్ డ్రోన్ల ద్వారా దాడులకు పాల్పడకుండా మిలిటరీ కేంద్రాల వద్ద యాంటీ డ్రోన్ సిస్టమ్ ను ఏర్పాటు చేసింది.