మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చక్కెర కర్మాగారాన్ని జప్తు చేసిన ఈడీ

  • చక్కెర ఫ్యాక్టరీ విలువ రూ. 65.75 కోట్లన్న ఈడీ
  • పూణే సహకార బ్యాంకు నుంచి రూ. 700 కోట్ల రుణం
  • ఇందులో నేరపూరిత సంపాదన ఉందన్న ఈడీ 
ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ అన్న కుమారుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌‌కు చెందిన సతారాలోని చక్కర కర్మాగారం 'జరందేశ్వర్ సహకారి షుగర్ కార్ఖానా' (జరందేశ్వర్ ఎస్ఎస్‌కే)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిన్న జప్తు చేసింది. మనీ లాండరింగ్ (పీఎంఎల్ఏ) కింద అజిత్ పవార్ చక్కెర కర్మాగారాన్ని జప్తు చేశామని, దీని విలువ  రూ. 65.75 కోట్ల వరకు ఉంటుందని ఈడీ నిన్న ప్రకటించింది. ఈ మిల్లు ఆస్తులను చూపించి పూణె జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నుంచి ఇంత వరకు రూ. 700 కోట్లను రుణంగా పొందినట్టు ఈడీ తెలిపింది. ఇందులో నేరపూరిత సంపాదన ఉందని ఈడీ ఆరోపించింది.


More Telugu News