జైల్లో ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన అఖిల్ గొగొయ్ విడుదల!

  • 2019లో సీఏఏకు వ్యతిరేక ఆందోళనలు
  • అఖిల్ పై రెండు కేసులు
  • తోసిపుచ్చిన ఎన్ఐఏ కోర్టు
ఇటీవల అసోంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జైలు నుంచి పోటీపడి, విజయం సాధించిన రైజోర్ దళ్ పార్టీ నేత అఖిల్ గొగొయ్ విడుదల అయ్యారు. 2019లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేసినందుకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారన్న ఆరోపణలపై ఆయన్ను అరెస్ట్ చేశారు. రెండు కేసుల్లో అఖిల్ గొగొయ్ అరెస్ట్ కాగా, దాదాపు ఏడాదిన్నరగా ఆయన జైల్లోనే గడుపుతున్నారు.

జైలు నుంచే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. శివసాగర్ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగగా ప్రజలు అఖండ విజయాన్ని అందించారు. గొగొయ్ పై నమోదైన రెండు కేసులనూ ఎన్ఐఏ కోర్టు తోసిపుచ్చడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. రేపు తన స్వస్థలానికి వెళ్లి, ప్రజలను కలుస్తానని, ఇకపై తన పోరు ఉపా చట్టంపైనే ఉంటుందని ఆయన అన్నారు.


More Telugu News