జలవివాదంపై.. ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ

  • రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం
  • తెలంగాణ అక్రమంగా నీటిని వాడుకుంటోందని జగన్ లేఖ
  • జల వివాదంలో జోక్యం చేసుకోవాలని విన్నపం
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. నదీ జలాలను అక్రమంగా వినియోగించుకుంటున్నారంటూ ఇరు రాష్ట్రాల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. ఐదు పేజీల లేఖను పంపించారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని వాడుకుంటోందని లేఖలో జగన్ ఆరోపించారు.

కేఆర్ఎంబీ అనుమతి లేకుండానే విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ కృష్ణా జలాలను ఉపయోగిస్తోందని... దాన్ని నిలిపివేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ప్రధానిని జగన్ కోరారు. రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదంలో కలగజేసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలైన సీఐఎస్ఎఫ్ తో రక్షణ కల్పించాలని కోరారు. లేఖతో పాటు కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి రాసిన మూడు లేఖలు, తెలంగాణ జెన్ కోకు రాసిన లేఖ, విద్యుదుత్పత్తికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీని జత చేశారు.


More Telugu News