ముఖ్యమంత్రి జగన్ కు ఎంపీ రఘురామకృష్ణ రాజు మ‌రో లేఖ

  • 'నవ సూచనలు' పేరుతో లేఖ
  • సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చ‌ర్య‌లు తీసుకోవాలి
  • రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలకు వేసిన పార్టీ జెండా రంగులను మార్చాలి
  • తక్షణమే పాత రంగులలోకి మార్చేలా చర్యలు తీసుకోవాలి
ముఖ్యమంత్రి జగన్ కు ఎంపీ రఘురామకృష్ణ రాజు 'నవ సూచనలు (విన‌మ్ర‌త‌తో)' పేరుతో మ‌రో లేఖ రాశారు. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలకు వేసిన పార్టీ జెండా రంగులను తక్షణమే పాత రంగులలోకి మార్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ గారిని కోరుతున్నాను.  ఈ రంగులు మార్చడం ద్వారా సుప్రీంకోర్టు తీర్పును గౌరవించినట్టవుతుంది' అని ఆయ‌న పేర్కొన్నారు.

అన్నీ తెలిసే ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని రఘురామకృష్ణ రాజు చెప్పారు. 'అన్నీ తెలిసినమ్మ అమావాస్య నాడు చ‌స్తే, ఏమీ తెలియ‌నమ్మ ఏకాద‌శి నాడు చ‌చ్చింద‌ట' అంటూ ఆయ‌న ఎద్దేవా చేశారు. 'పేనుకు పెత్త‌నం ఇస్తే త‌ల అంతా గొరికి పెట్టింది అంట' అన్న‌ట్లు తీరు ఉంద‌ని అన్నారు.

   


More Telugu News