రవితేజ 68వ సినిమా షూటింగ్ ప్రారంభం!

  • 'క్రాక్'తో తిరుగులేని హిట్
  • 'ఖిలాడి' షూటింగు పూర్తి
  • కొత్త దర్శకుడితో సినిమా మొదలు
  • కథానాయికగా దివ్యాన్ష కౌశిక్  
మొదటి నుంచి కూడా రవితేజ తన సినిమాల విషయంలో పెద్దగా గ్యాప్ ఇవ్వడు. ఒక సినిమా పూర్తవుతుండగానే, తదుపరి సినిమా సెట్స్ పైకి వెళ్లేలా ఆయన ప్లాన్ చేసుకుంటాడు. అందువలన ఏడాదికి మూడు సినిమాలు ఆయన నుంచి వస్తుంటాయి. ఈ ఏడాది ఆరంభంలోనే 'క్రాక్' సినిమాతో తిరుగులేని హిట్ అందుకున్న రవితేజ, ఆ తరువాత సినిమా అయిన 'ఖిలాడి'ని కూడా పూర్తిచేశాడు. ఆ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటూ ఉండగానే, ఈ రోజున మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. కెరియర్ పరంగా ఇది రవితేజకు 68వ సినిమా.

ఇటీవలే శరత్ మండవ అనే కొత్త దర్శకుడికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ వెంటనే పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. ఆ సినిమా రెగ్యులర్ షూటింగును ఈ రోజున మొదలుపెట్టారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, ఒక పోస్టర్ ను వదిలారు. రవితేజ ఈ సినిమాను కూడా చాలా వేగంగా పూర్తిచేయనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా దివ్యాన్ష కౌశిక్ సందడి చేయనుంది. సామ్ సీఎస్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే మిగతా వివరాలను వెల్లడించనున్నారు.  


More Telugu News