'రాధేశ్యామ్'ను కంప్లీట్ చేసిన పూజ హెగ్డే!

  • రీ షూట్ కి వెళ్లిన 'రాధేశ్యామ్'
  • పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథ
  • ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల  
ప్రభాస్ .. పూజ హెగ్డే జంటగా 'రాధేశ్యామ్' రూపొందుతోంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఆల్రెడీ షూటింగును పూర్తిచేసుకుంది. అయితే కొన్ని సీన్ల విషయంలో అసంతృప్తి కారణంగా మళ్లీ వాటిని షూట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే కరోనా కారణంగా వెంటనే ఆ పని చేయడానికి కుదరలేదు. పరిస్థితులు అనుకూలించడంతో 10 రోజుల షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. రీసెంట్ గా ఆ షెడ్యూల్ షూటింగును మొదలుపెట్టారు.

ముందుగా పూజ హెగ్డేకి సంబంధించిన కొన్ని సీన్స్ ను చిత్రీకరించారట. ఆమె పోర్షన్  కి సంబంధించిన షూటింగు పూర్తికావడంతో, ఆమె బై చెప్పేసిందని అంటున్నారు. ఇక ప్రభాస్ పై ఉన్న సీన్స్ ను చిత్రీకరించే పనిలో ఉన్నారట. అది కాస్తా జరిగితే షూటింగు పార్టు పూర్తయినట్టే. పునర్జన్మలతో కూడిన ఈ ప్రేమకథ ఇటలీ నేపథ్యంలో నడుస్తుంది. ప్రతి దృశ్యాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతిపాట మనసును పట్టుకునేదిలా ఉంటుందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.


More Telugu News