రాహుల్ గాంధీ విషయంలో తప్పు చేసి కాంగ్రెస్ కు దూరమయ్యా: కన్నడ సినీ నటి రమ్య

  • గతంలో మాండ్య ఎంపీగా ఉన్న రమ్య
  • కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ చార్జ్ గానూ బాధ్యతలు
  • పార్టీకి దూరమైన కారణాన్ని మాత్రం చెప్పని రమ్య
కాంగ్రెస్ కు రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తాను ఓ తప్పు చేశానని, అదే తనను పార్టీకి దూరం చేసిందని కన్నడ సినీ నటి రమ్య వాపోయారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమ ఇన్ చార్జ్ గా రమ్య వ్యవహరించిన సంగతి తెలిసిందే. సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి, మాండ్య నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన రమ్య, ఆపై రాహుల్ గాంధీ కోటరీలో చేరిపోయారు.

 సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, 'దివ్య స్పందన' పేరిట ట్విట్టర్ ఖాతాను ప్రారంభించిన ఆమె, కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ నేతలపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూ, వార్తల్లో నిలిచారు. ఆపై కాంగ్రెస్ పార్టీకి ఆమె రాజీనామా చేశారు. అయితే, తను రాహుల్ విషయంలో చేసిన తప్పేంటన్న విషయాన్ని మాత్రం రమ్య వెల్లడించక పోవడం గమనార్హం.



More Telugu News