వింబుల్డన్ లో ఆగని జొకోవిచ్ జోరు... టాప్-10లోని పలువురు మహిళల ఓటమి!
- రెండో రౌండ్ లో వరుస సెట్లలో విజయం
- 1.41 గంటల్లో ముగిసిన పోరు
- ఒక్క బ్రేక్ పాయింట్ నూ కోల్పోని వరల్డ్ నంబర్ వన్
- మహిళల పోరులో కెనిన్, ఆండ్రెస్క్యూ, బెన్ చిచ్ ఓటమి
వింబుల్డన్ టెన్నిస్ పోటీలు కొందరికి మోదాన్ని, కొందరికి ఖేదాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటికే పలువురు టాప్ క్రీడాకారులు మొదటి, రెండో రౌండ్ లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన పోటీల్లో మహిళల సింగిల్స్ లో నాలుగో ర్యాంకర్ గా బరిలోకి దిగిన సీడ్ కెనిన్, ఐదో సీడ్ గా ఉన్న ఆండ్రెస్కూ, తొమ్మిదో సీడ్ గా ఉన్న బెన్ చిచ్ తమ ప్రత్యర్థుల చేతుల్లో ఓటమి పాలయ్యారు.
ఇక మరో వింబుల్డన్ టైటిల్ పై గురిపెట్టిన వరల్డ్ నంబర్ వన్, సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ రెండో రౌండ్ లో సునాయాస విజయం సాధించారు. 2018లో రన్నరప్ గా నిలిచిన కెవిన్ ఆండర్సన్ తో రెండో రౌండ్ లో తలపడిన జొకోవిచ్ మూడు వరుస సెట్లలో గెలిచారు. 1.41 గంటల పాటు జరిగిన మ్యాచ్ లో 6-3, 6-3, 6-3 తేడాతో విజయం సాధించాడు. ఈ క్రమంలో 9 ఏస్ లను సంధించిన జొకో, ఆండర్సన్ సర్వీస్ ను నాలుగు సార్లు బ్రేక్ చేయడం గమనార్హం. ఒక్క బ్రేక్ పాయింట్ ను కూడా జొకోవిచ్ కోల్పోకపోవడం గమనార్హం.
మహిళల సింగిల్స్ విజయానికి వస్తే రెండో సీడ్ గా బరిలోకి దిగిన బెలారస్ క్రీడాకారిణి సబలెంకా మూడవ రౌండ్ లోకి ప్రవేశించింది. ఇదే సమయంలో టాప్-10లోని పలువురు ఓటమి పాలయ్యారు. అమెరికాకు చెందిన నాలుగో సీడ్ సోఫియా కెనిన్, కెనడాకు చెందిన ఐదో సీడ్ బియాంక, స్విట్జర్లాండ్ కు చెందిన బెలిండా బెన్ చిచ్ లు ఓడిపోయారు. వీరిని ఓడించిన వారంతా టెన్నిస్ గ్రాండ్ స్లామ్ ప్రపంచంలో ఇప్పటివరకూ అంతగా పేరు తెచ్చుకోనివారే కావడం గమనార్హం.