నక్సలైట్ నంటూ బీజేపీ నేతకు ఫోన్.. రూ. 2 కోట్ల డిమాండ్
- బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో ఘటన
- ధామ్‌దహా బీజేపీ ఇన్‌చార్జ్ గౌతమ్ కుమార్‌కు ఫోన్ కాల్
- 8 రోజుల్లో అడిగినంత ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరింపు
బీజేపీ నేతకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి తాను మావోయిస్టునని బెదిరించాడు. రెండు కోట్ల రూపాయలు పంపాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ధామ్‌దహా బీజేపీ ఇన్‌చార్జ్ గౌతమ్ కుమార్‌కు పింటూరాణా అనే వ్యక్తి ఫోన్ చేశాడు.
తాను నక్సలైట్‌నని, ఎనిమిది రోజుల్లో రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకుంటే చంపేస్తానని హెచ్చరించాడు. బెదిరింపులపై గౌతమ్ కుమార్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గౌతమ్ కుమార్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.