ముగిసిన కేంద్ర క్యాబినెట్ సమావేశం... కీలక అంశాలు ఇవిగో!

  • ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ భేటీ
  • పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
  • డిస్కంల సంస్కరణలకు సమ్మతి
  • ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీకి గ్రీన్ సిగ్నల్
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ, పవర్ డిస్కం సంస్కరణలు, భారత్ నెట్ వంటి అంశాలకు క్యాబినెట్ సమ్మతి తెలిపింది.

  • కరోనా ప్రభావిత రంగాల ఉద్దీపన ప్యాకేజీకి ఆమోదం
  • పవర్ డిస్కంల సంస్కరణలు, బలోపేతానికి భారీ ఆర్థికసాయం
  • డిస్కంల సామర్థ్యం పెంపుదల కోసం షరతులు వర్తించేలా సాయం
  • కేంద్రం షరతులకు అంగీకరిస్తేనే ఆర్థిక సాయం అందజేత
  • కొత్త విధానం కోసం రూ.3,03,758 కోట్ల మేర అంచనాలు
  • ప్రస్తుతానికి రూ.97,631 కోట్లు కేటాయింపు
  • అన్ని గ్రామాల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలు... నిధుల కేటాయింపు
  • భారత్ నెట్ ద్వారా 16 రాష్ట్రాల్లో ఫైబర్ నెట్ వర్క్ ఏర్పాటు
  • భారత్ నెట్ కు రూ.19,041 కోట్ల కేటాయింపునకు ఆమోదం


More Telugu News