లీటరు పాలపై రూ.2 పెంచిన అమూల్

  • పెరిగిన ఉత్పత్తి వ్యయం
  • కీలక నిర్ణయం తీసుకున్న అమూల్
  • అన్ని బ్రాండ్లపై ధర పెంపు
  • జులై 1 నుంచి కొత్త ధరలు
చమురు నుంచి నిత్యావసరాల వరకు దేశంలో ధరల పెంపు ప్రజలను బెంబేలెత్తిస్తోంది. తాజాగా పాల ధరలు పెంచుతూ అమూల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక లీటరుపై రూ.2 పెంచింది. పెంచిన ధరలు రేపటి (జులై 1) నుంచి అమల్లోకి వస్తాయని అమూల్ పాలు, పాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ వెల్లడించింది.

ఉత్పత్తి ఖర్చులతో పాటు ప్యాకింగ్, రవాణా, ఇంధన వ్యయం కూడా పెరగడం వల్లే ధరల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఫెడరేషన్ స్పష్టం చేసింది. గోల్డ్, తాజా, శక్తి, టీ స్పెషల్ వంటి అమూల్ బ్రాండ్లు అన్నింటికి ధరల పెంపు వర్తిస్తుందని వివరించింది.


More Telugu News