తెలంగాణలో మీ ఆస్తులు కాపాడుకోవడానికే జల వివాదాలపై మాట్లాడడంలేదు: సీఎం జగన్ పై కాంగ్రెస్ నేత పద్మశ్రీ ఫైర్

  • తెలంగాణ ప్రాజెక్టులపై సీఎం జగన్ వ్యాఖ్యలు
  • తెలంగాణలో ఏపీ ప్రజలున్నారు 
  • అందుకే ఎక్కువగా మాట్లాడడంలేదని వివరణ
  • సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్న పద్మశ్రీ
తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజల గురించి ఆలోచిస్తున్నానని, అందుకే జలవివాదాలపై ఎక్కువగా మాట్లాడడం లేదని సీఎం జగన్ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో జగన్ కు ఆస్తులు ఉన్నందునే ఆయన మౌనంగా ఉంటున్నారని ఆరోపించారు. జగన్ అసమర్థ సీఎం అంటూ వ్యాఖ్యానించారు. ఓవైపు తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఏపీ సీఎం జగన్ మాట్లాడకపోవడం చూస్తుంటే, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కేసీఆర్ ముందు తాకట్టు పెట్టినట్టుగా భావించాల్సి వస్తోందని విమర్శించారు.

"తెలంగాణలోని మీ ఆస్తులు కాపాడుకునేందుకే మీరు నోరు మెదపడంలేదు. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారంటూ సిగ్గులేకుండా చెబుతారా?" అంటూ పద్మశ్రీ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె వైఎస్ షర్మిలపైనా వ్యాఖ్యలు చేశారు. జగన్ చెల్లెలు షర్మిల కూడా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతున్నారని, చుక్క నీటిని కూడా వదులుకునేది లేదంటున్నారని విమర్శించారు. 


More Telugu News