ప్రియాంక గాంధీతో సుదీర్ఘ చర్చలు జరిపిన సిద్దూ
- పంజాబ్ కాంగ్రెస్ లో విభేదాలు
- సీఎం అమరీందర్ తో విభేదిస్తున్న సిద్దూ
- ఈ ఉదయం ప్రియాంకతో భేటీ అయిన మాజీ క్రికెటర్
పంజాబ్ కాంగ్రెస్ లో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తో మాజీ క్రికెటర్, ఎమ్మెల్యే నవజోత్ సింగ్ సిద్దూ విభేదిస్తున్నారు. సీఎంపై ఆయన బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు పంజాబ్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ముగ్గురు సీనియర్ నేతలతో ఒక ప్యానల్ ను ఏర్పాటు చేసింది. ఇటీవలీ ఈ ప్యానల్ తో అమరీందర్ ఢిల్లీలో భేటీ అయ్యారు. అయితే ప్యానల్ తో సిద్దూ సమావేశం కాకపోవడంపై మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రియాంకగాంధీతో తాను భేటీ అయిన ఫొటోను సిద్దూ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈరోజు ఉదయం ఆమెను కలిసినట్టు ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, తాను పోషించబోయే పాత్ర గురించి ప్రియాంకతో చర్చించానని ఆయన చెప్పారు. తమ చర్చలు సుదీర్ఘంగా కొనసాగాయని తెలిపారు. రాహుల్ గాంధీని కూడా సిద్దూ కలవాలని అనుకున్నప్పటికీ... కొన్ని కారణాల వల్ల అది జరగలేదు.