వీఐపీ ఫోన్ నెంబర్ అంటూ రూ.కోటికి పైగా టోకరా!
- స్మార్ట్ గా రూ.1.43 కోట్లు వసూలు చేసిన మోసగాడు
- అహ్మదాబాద్ లో ఘటన
- వీఐపీ మొబైల్ నెంబర్ కేటాయించారంటూ ఫోన్ కాల్
- ప్రాసెసింగ్ ఫీజుల పేరిట మోసం
ఈ స్మార్ట్ యుగంలో మోసాలు కూడా ఎంతో స్మార్ట్ గానే జరుగుతున్నాయి! ఫోన్ కు వీఐపీ మొబైల్ నెంబరు వచ్చిందంటూ ఓ మోసగాడు ఏకంగా రూ.కోటికి పైగా వసూలు చేశాడు. ఆ మోసగాడి పేరు ధ్రువిల్. అహ్మదాబాద్ శివారు ప్రాంతం నవ వడాజ్ లో నివసిస్తుంటాడు. తేలిగ్గా అధికమొత్తంలో డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న ధ్రువిల్... గత రెండేళ్లుగా ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని వీఐపీ మొబైల్ నెంబర్ పేరిట మోసానికి పాల్పడుతున్నాడు. దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ధ్రువిల్ మోసకారితనం వెల్లడైంది.
మీ ఫోన్ కు వీఐపీ మొబైల్ నెంబరు కేటాయించారంటూ తనకు ఫోన్ కాల్ వచ్చిందని బాధితుడు వెల్లడించాడు. అయితే ఈ పక్రియను ముందుకు తీసుకెళ్లడానికి రుసుములు చెల్లించాలని కోరడంతో అనేక దఫాలుగా రూ.1.43 కోట్లు అతడి ఖాతాలో జమ చేశానని తెలిపాడు. కాగా, బాధితుడికి మరింత నమ్మకం కలిగించడానికి ధ్రువిల్ ఇన్ వాయిస్ లు కూడా పంపించేవాడు. ఓసారి అదనంగా చెల్లించారంటూ రూ.11 లక్షలను వాపసు కూడా చేయడంతో బాధితుడు అతగాడిని బాగా నమ్మాడు.
అయితే ఎంతకీ సిమ్ కార్డు రాకపోవడంతో బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సైబర్ పోలీసులు ధ్రువిల్ ను అరెస్ట్ చేశారు. అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.1.40 కోట్లను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు.