కాంగ్రెస్ పార్టీ లేకుండా విపక్ష కూటమి ఎలా సాధ్యం?: తేజస్వి యాదవ్
- బీజేపీని ఎదుర్కోవడానికి విపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉంది
- ఏ విపక్ష కూటమికైనా కాంగ్రెస్ పార్టీనే పునాది
- దేశాన్ని కాపాడుకోవడానికి విపక్ష పార్టీలు రాజీమార్గం అనుసరించాలి
దేశంలో బీజేపీని ఎదుర్కోవడానికి విపక్షాలు ఏకం కావలసిన అవసరం ఉందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ లేకుండా విపక్ష కూటమి సాధ్యం కాదని చెప్పారు. ఏ విపక్ష కూటమికైనా కాంగ్రెస్ పార్టీనే పునాది అని తెలిపారు. 2024 ఎన్నికల్లో కూటమిగా ఏర్పడే పార్టీలకు కాంగ్రెస్ మూలాధారమవుతుందని చెప్పారు. కాంగ్రెస్ లేకుండా విపక్ష కూటమిని ఊహించుకోలేమని తెలిపారు. కాంగ్రెస్ ఉంటేనే ఏ విపక్ష కూటమి అయినా సాధ్యమవుతుందని చెప్పారు.
మన దేశాన్ని కాపాడుకోవడానికి విపక్ష పార్టీలు రాజీమార్గం అనుసరించాలని అన్నారు. బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. కూటమిలో ఎవరికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలనే నిర్ణయాన్ని ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని చెప్పారు.