తెలంగాణ మంత్రుల్లా అసభ్య పదజాలం వాడాల్సిన అవసరం మాకు లేదు: మంత్రి బొత్స
- నీటి పంపకాల విషయంలో బొత్స వ్యాఖ్యలు
- రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ మాటలు
- నీటి పంపకాల అంశంపై మాది స్పష్టమైన వైఖరి
- మా ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోలేదు
నీటి పంపకాల విషయంలో కొన్ని రోజులుగా టీఆర్ఎస్ నేతలు ఏపీ ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. తెలంగాణ మంత్రుల్లా అసభ్య పదజాలం వాడాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ నేతలు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
నీటి పంపకాల అంశంపై వైసీపీ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని బొత్స సత్యనారాయణ తెలిపారు. అయితే, ప్రభుత్వమేమీ చేతులు ముడుచుకుని కూర్చోలేదని అన్నారు. సమాఖ్య వ్యవస్థలో ఎవరి అధికారాలు వారికి ఉంటాయని చెప్పుకొచ్చారు. ఒకవేళ ఎవరైనా చట్టపరిధిని దాటితే వ్యవస్థలు జోక్యం చేసుకుంటాయని అన్నారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించేందుకు అక్కడకు వెళ్లాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.