రేవంత్ రెడ్డి ఖైదీ నెంబర్ 1799: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
- రేవంత్ ఏ పార్టీలోకి వెళితే ఆ పార్టీ ఖతమైపోతుంది
- పదవులు వచ్చిన వాళ్లు హుందాగా ఉండాలి
- బ్లాక్ మెయిల్ చేయడంలో రేవంత్ సిద్ధహస్తుడు
పీసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడి కోసం కాంగ్రెస్ పార్టీ కొండను తవ్వి ఎలుకను పట్టిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ ఖతమైపోతుందని వ్యంగ్యంగా అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ శకం ఇక ముగిసినట్టేనని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి ఖైదీ నంబర్ 1799 అని విమర్శించారు. పదవులు వచ్చిన వాళ్లు హుందాగా ఉండాలని అన్నారు. సోనియాగాంధీపై సదభిప్రాయం ఉండేదని... అయితే, రేవంత్ ను పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన తర్వాత ఆ అభిప్రాయం పోయిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే జైలు పార్టీ అని విమర్శించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ నేతలందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. బ్లాక్ మెయిల్ చేయడంలో రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడని దుయ్యబట్టారు. రేవంత్ జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు.